Saturday, January 3, 2009

నా గడియారం

--- ఇక్బాల్ చంద్
నన్ను
కొంచెం కొంచెంగా
చప్పరిస్తూ
మరణ వాంగ్మూలం
రాస్తుంది ఇది-
నా వీలునామాలో
ఏవో నాలుగు పద్యాలు తప్ప
మరేమీ కన్పించనందుకు
నన్ను
కాపలా కాసిన
ఈ గడియారాన్ని
అసహనంతో
లోకం శపిస్తోంది-





డా. అల్లామా మొహ్మద్ ఇక్బాల్
1. వసంతాల్ని వదిలి
యుగాల్నించి
నిరీక్షిస్తున్న వనంలోకి
గంధర్వ తుమ్మెద వచ్చి
అమరగానం చేసి పోయింది.
2.
అల్లామా!
మీరు దారి తప్పు ఇటు వచ్చి
నలుదినాల్ని కవిత్వం చేసి
మాయమైన పైగంబరులు
మొహ్మద్ ఇక్బాల్!
కుండపోత వాన మసక మనస్సుల్లోని
మిణుగురుల గుంపు నిర్గమ్య సంచారుల
కన్నుల్లో వెలిగే స్వప్నపాలపుంత
జనులు పాడుకొనే గీతంలో
నేల నుంచి తారల పురానికావల వరకు
ప్రేమలో ముంచిన సాఖి
3.
ఋతువు రసమధుపానమైనాక
ఎగిరిపోయింది
కాలమే ఇంకా మత్తుగా తూగుతోంది.

No comments:

Post a Comment