Monday, January 19, 2009

మరొ ఇంటికి.....

మరొ ఇంటికి.....
1.
గుబురు ఆకు కొమ్మల్లొనుంచి
ఎగిరి
దగ్డ వనానికి ప్రయణం-

ఎంత వొదిలి వొచ్చినా
ఇంకా కొంత
తగిలె ఉంటూంది-
2.
సర్దుతున్నా కొద్ది
మరింత వెలితి---
3.
పాత ఇల్లు
కొత్త ఇల్లు ల మధ్య
చాలా వైరుధ్యం-
మరింత గందరగొళం-

గదప గదప కీ
గెంతె కొంటె పిల్లి లా
కాలమ్ గడుస్థూవుంది-
వెలిసి పొయిన
పాత రంగులు కనిపించ కుండా
ఇక్కడ మళ్ళీ కొత్ట రంగులు
అద్దుకొవాలి-
4.
అలవాటయిన చెరువు నీంచి
అపరిచయపు ప్రవాహం లొకి
గెంతినట్లుగా వుంది--

---ఇక్బాల్ చంద్.

No comments:

Post a Comment